నేను మీ బాస్‌ను అంటూ.. ఐనాక్స్ గ్రూప్‌కు రూ.10 కోట్ల సైబర్ మోసం
- ఐనాక్స్ గ్రూప్‌లో రూ. 10.4 కోట్ల భారీ వాట్సాప్ స్కామ్
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లా నటించి ఉద్యోగికి టోకరా
- రెండు వారాల్లో 63 విడతల్లో డబ్బు బదిలీ
- కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు, ఢిల్లీలో నలుగురి అరెస్ట్
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐనాక్స్ గ్రూప్‌లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరుతో వాట్సాప్ వేదికగా నమ్మించిన కేటుగాళ్లు, ఒక సీనియర్ ఉద్యోగి నుంచి ఏకంగా రూ. 10.4 కోట్లకు పైగా సొమ్మును కాజేశారు. కేవలం రెండు వారాల వ్యవధిలో 63 లావాదేవీల ద్వారా ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేయించడం గమనార్హం.
ఐనాక్స్ అకౌంట్స్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గిరీష్ అమిన్‌కు జూన్ 3వ తేదీన ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. తాను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్‌ను అని, ఇది తన వ్యక్తిగత నంబర్ అని సదరు వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా సిద్ధార్థ జైన్ ఫోటో ఉండటంతో అమిన్ అతడిని నిజమని నమ్మాడు.
తాను ఒక ముఖ్యమైన సమావేశానికి వెళుతున్నానని, అత్యవసరంగా, కొంత డబ్బు పంపాలని నిందితుడు ఆదేశించాడు. బాస్ ఆదేశాలుగా భావించిన అమిన్, జూన్ 3 నుంచి 15వ తేదీల మధ్య సుమారు 63 విడతల్లో మొత్తం రూ. 10.4 కోట్లను వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు.
అనంతరం అకౌంట్స్ సమీక్ష సమయంలో, బదిలీ చేసిన నగదుకు సంబంధించిన ఇన్వాయిస్ల కోసం అమిన్ అధికారికంగా సిద్ధార్థ్ జైన్‌ను సంప్రదించడంతో ఈ మోసం బయటపడింది. తాను అటువంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని జైన్ స్పష్టం చేయడంతో బాధితుడు ఖంగుతిన్నాడు. కంపెనీ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉందని, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.